ganta sreenivasa rao: గంటా శ్రీనివాసరావుతో భేటీ అయిన మాజీ డీజీపీ

  • నిన్న రాత్రి గంటా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన సాంబశివరావు
  • ఇటీవలే చంద్రబాబు, జగన్ లతో కూడా భేటీ
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న వరుస సమావేశాలు

ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు రాజకీయ నేతలలో వరుసగా భేటీ అవుతున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ ను కలిసిన సాంబశివరావు... రెండు రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా భేటీ అయ్యారు. తాజాగా విశాఖపట్నంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. నిన్న రాత్రి నేరుగా గంటా నివాసానికి వెళ్లిన ఆయన, పలు విషయాలపై చర్చించినట్టు సమాచారం. వ్యక్తిగతంగా గంటాతో సాంబశివరావుకు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే జగన్ తో కూడా భేటీ అయిన ఆయన... ఇప్పుడు గంటాను కలవడం చర్చనీయాంశం అయింది. అయితే వీరి మధ్య జరిగిన చర్చ వివరాలు మాత్రం బయటకు రాలేదు. 

ganta sreenivasa rao
sambasiva rao
  • Loading...

More Telugu News