Mohan babu: 'ఫసక్' పదంపై స్పందించిన మోహన్ బాబు!

  • రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మోహన్ బాబు
  • తనదైన శైలిలో 'ఫసక్' పదాన్ని వాడిన కలెక్షన్ కింగ్
  • నెట్టింట 200కు పైగా స్పూఫ్ వీడియోల ట్రెండింగ్

ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు, తన సినిమాకు చెందిన ఓ సన్నివేశాన్ని తనదైన శైలిలో వివరిస్తూ, వాడిన 'ఫసక్' అన్న పదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా, దానిపై ఆయన స్పందించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఈ పదంతో దాదాపు 200 స్పూఫ్ వీడియోలు తయారయ్యాయని తనకు విష్ణు చెప్పాడని అన్నారు. తాను కూడా కొన్ని చూశానని, అవన్నీ వినూత్నంగా, నవ్వు తెప్పించేలా ఉన్నాయని చెప్పారు. 'ఫసక్' అన్న పదం ట్రెండింగ్ లో ఉన్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ఇక 'ఫసక్' హ్యాష్ ట్యాగ్ తో మంచు ఫ్యామిలీలోని మనోజ్, విష్ణు, లక్ష్మి పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. 

Mohan babu
Fasak
Rajdeep Sardesai
  • Error fetching data: Network response was not ok

More Telugu News