taapsee: ఇప్పటి నుంచే నా జీవితం ప్రారంభమవుతుంది: తాప్సీ

  • సోదరితో కలసి రెస్టారెంట్ ప్రారంభిస్తున్నా
  • సినిమాలతోనే జీవితం అంతమైపోదు
  • సినిమాలు లేకపోయినా బతికే ధైర్యం ఉంది

పరాజయం పాలైన సినిమాల ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని హీరోయిన్ తాప్సీ తెలిపింది. ఓటమిని చూసి తాను ఎన్నడూ భయపడలేదని చెప్పింది. సినిమాలతోనే జీవితం అంతం కాదని చెప్పింది. తన సోదరితో కలసి ఓ రెస్టారెంట్ ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇకపైనే తన అసలైన జీవితం ప్రారంభమవుతుందని చెప్పింది.

భవిష్యత్తులో తనకు సినీ అవకాశాలు రాకపోయినా, ఏదైనా చేసుకుని బతికే ధైర్యం తనకు ఉందని తెలిపింది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరో రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. మరో చిత్రం ప్రీప్రొడక్షన్ లో ఉంది. రాఘవేంద్రరావు రూపొందించిన 'ఝుమ్మంది నాదం' సినిమా ద్వారా తాప్సీ సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పటి వరకు వివిధ భాషల్లో 30కి పైగా చిత్రాల్లో నటించింది.

taapsee
tollywood
bollywood
kollywood
restaurant
  • Loading...

More Telugu News