Rahul Gandhi: ఈనెల 18న‌ రాహుల్ గాంధీతో క‌ర్నూల్‌లో భారీ బ‌హిరంగ స‌భ: ఏపీసీసీ

  • కార్య‌క‌ర్త‌ల‌తో ఊమెన్‌చాందీ, రఘువీరా స‌మావేశం
  • ఈనెల 6న కర్నూల్‌లో పర్యటన 
  • ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఏపీసీసీ

ఈనెల 18న కర్నూల్‌కు ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రాక సంద‌ర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, కార్య‌క్ర‌మాల‌పై కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌డానికి ఈనెల 6న కర్నూల్‌కు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కేర‌ళ మాజీ సీఎం ఊమెన్‌చాందీ, ఏపీసీసీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ఎన్‌. ర‌ఘువీరారెడ్డి రానున్న‌ట్లు ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(అడ్మిన్‌) ఎస్‌.ఎన్‌.రాజా తెలిపారు. ఈమేర‌కు ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

రాహుల్ గాంధీ రాక‌కు సంబంధించి చేపట్టాల్సిన కార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌డంతో పాటుగా దామోదరం సంజీవ‌య్య స్మార‌క భ‌వ‌నాన్ని ఏర్పాటు చేయ‌డానికి స్థ‌ల ప‌రిశీల‌న చేస్తారని అ‌న్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి, కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో రాహుల్ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల‌పై పీసీసీ సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తార‌న్నారు.

Rahul Gandhi
Congress
raghuveera reddy
Andhra Pradesh
  • Loading...

More Telugu News