babu mohan: టీఆర్ఎస్ కార్యకర్తలపై కాలెత్తిన బాబూమోహన్.. వీడియో చూడండి!

  • వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న బాబూమోహన్
  • ఇప్పటికే పలుమార్లు అసభ్య పదజాలాన్ని వాడిన ఎమ్మెల్యే
  • ప్రగతి నివేదన సభ సందర్భంగా కార్యకర్తలపై దురుసు ప్రవర్తన

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ ఇటీవలి కాలంలో పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా, అసభ్య పదజాలంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ప్రగతి నివేదన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది టీఆర్ఎస్ మద్దతుదారులు హాజరైన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గం నుంచి కూడా ర్యాలీని బాబూ మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తనకు అడ్డుగా ఉన్న కొందరిపై ఆగ్రహంతో కాలు లేపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

babu mohan
tollywood
TRS
mla
misbehaviour
  • Error fetching data: Network response was not ok

More Telugu News