Rajanikant: రజనీకాంత్ వదిన కళావతి మృతి!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1038f8b0a268c583c622b84b3b413ecb165f3808.jpg)
- బెంగళూరులో మరణించిన కళావతి బాయి
- గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్య
- ముగిసిన అంత్యక్రియలు
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న సత్యనారాయణరావు గైక్వాడ్ భార్య కళావతి బాయి (72) ఆదివారం రాత్రి బెంగళూరులో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరు వెళ్లారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె, చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి.
కాగా, రజనీకాంత్ సినిమాలలో వేషాల కోసం చెన్నయ్ వచ్చిన సమయంలో అన్నావదెనలు ఆయనను ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ విషయాన్ని రజనీ పలుసార్లు వేదికలపై చెప్పారు. కళావతి బాయి అంత్యక్రియలు నిన్న సాయంకాలం బెంగళూరులో ముగిశాయి.