Air Fare: ఆటో ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌక: జయంత్ సిన్హా

  • కిలోమీటరుకు రూ. 4 మాత్రమే
  • ఆటో ఎక్కితే రూ. 10 కట్టాలి
  • విమానయాన మంత్రి జయంత్ సిన్హా

ఇండియాలో విమాన ప్రయాణం మరింత చౌకగా మారిపోయిందని పౌరవిమానయాన మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యానించారు. విమాన ప్రయాణానికి కిలోమీటరుకు రూ. 4 కూడా పడటం లేదని, ఇది ఆటో రిక్షా అద్దె కన్నా చాలా తక్కువని ఆయన అన్నారు. ఇద్దరు మనుషులు ఆటో తీసుకుని బయలుదేరి, కిలోమీటరుకు రూ. 10 ఇచ్చారని అనుకుంటే, ఒక్కొక్కరూ రూ. 5 చెల్లించాల్సివుంటుందని, విమానంలో ఎక్కితే అంతకన్నా తక్కువే చార్జ్ పడుతుందని ఆయన అన్నారు. ఈ కారణం వల్ల కూడా ఇండియన్ ఎయిర్ లైన్స్ కంపెనీలు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయని ఆయన అన్నారు. కాగా, సీఏపీఏ గణాంకాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.9 బిలియన్ డాలర్ల వరకూ భారత విమానయాన సంస్థలు నష్టపోతాయని అంచనా.

  • Error fetching data: Network response was not ok

More Telugu News