charan: యూరప్ లో చరణ్ మూవీ షూటింగ్ మొదలు

  • బోయపాటితో చరణ్ మూవీ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • త్వరలోనే ఫస్టులుక్ విడుదల

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ మూవీ రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజా షెడ్యూల్ ను యూరప్ - అజర్బైజాన్ లో ప్లాన్ చేశారు. ఈ ప్రాంతంలో షూటింగు జరుపుకుంటోన్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ రోజు నుంచి అక్కడ షూటింగు మొదలుకానుంది.

25 రోజుల పాటు ఏకధాటిగా అక్కడ షూటింగ్ జరపనున్నారు. చరణ్ .. వివేక్ ఒబెరాయ్ .. సీనియర్ హీరో ప్రశాంత్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. అలాగే చరణ్ .. కైరా అద్వాని కాంబినేషన్లో ఒక పాటను కూడా అక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్టులుక్ ను వదలనున్నారని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.    

charan
kiara adwani
  • Loading...

More Telugu News