Ravishastri: రవిశాస్త్రితో ప్రేమాయణం వార్తలపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్!

  • అన్ని వార్తలూ అవాస్తవమే
  • ఓ కార్యక్రమంలో కలిశామంతే
  • ట్విట్టర్ లో పేర్కొన్న నిమ్రత్ కౌర్

తాను టీమిండియా కోచ్ రవిశాస్త్రితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఆడి కార్ల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము పాల్గొన్నామని, అంతకు మించి మరేమీ లేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

తన గురించి మీడియాలో వస్తున్న వార్తలు చదివి ఎంతో బాధపడ్డానని చెప్పింది. ముందుముందు నిజం అందరికీ తెలుస్తుందని, తనకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. కాగా, తనకంటే దాదాపు 20 సంవత్సరాల చిన్నదయిన నిమ్రత్ తో రవిశాస్త్రి ప్రేమాయణం సాగిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Ravishastri
Nimrat Kaur
Dating
Trash
  • Error fetching data: Network response was not ok

More Telugu News