Antakuminchi: గౌరీకృష్ణపై ఫోర్జరీ కేసు పెట్టిన 'అంతకుమించి' చిత్రం హీరో!

  • రబ్బరు స్టాంపులతో మోసం చేసిన గౌరీకృష్ణ
  • సినిమా నిర్మాతను తానేనని వెల్లడి
  • విచారణ ప్రారంభించిన పోలీసులు

తన సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ రబ్బరు స్టాంపులు తయారు చేసిన గౌరీకృష్ణ అనే వ్యక్తి, తన ప్రతిష్ఠకు భంగం కలిగించాడని ఆరోపిస్తూ, అతనిపై చర్యలు తీసుకోవాలని  'అంతకుమించి' హీరో సతీష్ జై హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. గౌరీకృష్ణ తన క్యాషియర్ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడని ఆరోపించారు.

 కాగా,  'అంతకుమించి' చిత్రానికి తానే నిర్మాతనని, గౌరీకృష్ణ పోలీసులను, కోర్టును, పరిశ్రమను, మీడియానూ తప్పుదారి పట్టించాడని ఫిర్యాదు చేశాడు.  'అంతకుమించి' చిత్రానికి గౌరీ కృష్ణ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, మొత్తం రూ. 2.50 కోట్లను తాను వెచ్చించానని అన్నాడు. తప్పుడు ప్రకటనలు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లను సైతం నష్టపరిచాడని ఆరోపించాడు. సతీష్ జై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ ప్రారంభించారు.

Antakuminchi
Satish Jai
Movie
Hyderabad
Police
Banjarahills
Gouri Krishna
  • Loading...

More Telugu News