RBI: చలామణిలోకి వచ్చిన కొత్త రూ. 100 నోట్లు!
- బ్యాంకుల నుంచి అందుకుంటున్న కస్టమర్లు
- అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త కరెన్సీ
- పాత కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుందన్న ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల 1న కొత్త 100 రూపాయల కరెన్సీని చలామణిలోకి తేగా, బ్యాంకుల నుంచి పలువురు వాటిని అందుకుని బాగున్నాయంటూ ప్రశంసిస్తున్నారు. ముందుబాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, వెనుకవైపు 'రాణికీ వాస్' ముద్రించి వున్న ఈ నోటు లావెండర్ రంగులో ఉంది.
142 ఎంఎం పొడవు, 66 ఎంఎం వెడల్పుతో, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో దీన్ని తయారు చేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. గాంధీతో పాటు అశోకుడి నాలుగు సింహాలు, వాటర్ మార్క్, స్వచ్ఛ భారత్ లోగో తదితరాలు కూడా ఈ నోటుపై ముద్రించి వున్నాయి. ఈ నోట్లతో పాటు ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ. 100 కరెన్సీ కూడా చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ పేర్కొంది.