Vijay Devarakonda: రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇలాగే చేస్తా: విజయ్ దేవరకొండ

  • విజయ్ తాజా చిత్రం 'నోటా'
  • పాలిటిక్స్ లో తిరుగుబాటు చేసే యువనేత కథే!
  • తన స్వభావానికి దగ్గరగా క్యారెక్టర్ ఉంటుందంటున్న విజయ్

తాను రాజకీయాల్లోకి వస్తే, ఎలా చేస్తానో తన తాజా చిత్రం 'నోటా' చూసి తెలుసుకోవచ్చంటున్నాడు విజయ్ దేవరకొండ. గత సంవత్సరం 'అర్జున్ రెడ్డి', ఈ సంవత్సరం 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విజయ్ తాజాగా, స్టూడియో గ్రీన్ బ్యానర్ పై, ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నోటా' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సినిమా ఫస్ట్ లుక్ విడుదల తరువాత మాట్లాడిన విజయ్, తనకు రాజకీయాలంటే చాలా చిరాకని చెప్పాడు. రాజకీయాల్లో తిరుగుబాటు చేసిన ఓ యువ నేత కథే 'నోటా' అని తెలుస్తుండగా, తన స్వభావానికి దగ్గరగా ఈ చిత్రంలోని తన క్యారెక్టర్ ఉంటుందని విజయ్ చెప్పాడు. నాజర్, సత్యరాజ్ తదితర సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Vijay Devarakonda
NOTA
New Movie
Politics
Tollywood
  • Loading...

More Telugu News