Andhra Pradesh: ఆస్తులు ప్రకటించని ఎంపీల జాబితాలో టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ ఎంపీలు
- ఆర్టీఐ చట్టం ద్వారా వెలుగులోకి
- ఆస్తులు ప్రకటించని 94 మంది ఎంపీలు
- టీడీపీ, టీఆర్ఎస్ నుంచి చెరో ఏడుగురు
ఆస్తులు ప్రకటించని ఎంపీల జాబితాలో ఏపీ, తెలంగాణ నేతలు కూడా ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ ఆస్తులు ప్రకటించని వారి జాబితా కావాలంటూ రచనా కల్రా అనే సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ ద్వారా వివరాలు అడగ్గా ఈ విషయం వెల్లడైంది.
లోక్‌సభ, రాజ్యసభలో కలిసి మొత్తం 94 మంది ఎంపీలు తమ ఆస్తుల వివరాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీరిలో 65 మంది లోక్‌సభ సభ్యులు కాగా, 29 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆస్తులు ప్రకటించలేదు. టీడీపీ, టీఆర్ఎస్ నుంచి ఏడుగురు చొప్పున ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఆస్తులు ప్రకటించలేదు.