Gokul chat: హైదరాబాద్‌ జంట పేలుళ్ల విధ్వంసం కేసు.. 11 ఏళ్ల తర్వాత నేడు తీర్పు!

  • గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో నేడు తీర్పు
  • నాటి పేలుళ్లలో 44 మంది మృతి 
  • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో నేడు తీర్పు వెలువడనుంది. 25 ఆగస్టు 2007న బాంబు పేలుళ్లతో గోకుల్ చాట్ దద్దరిల్లింది. ఈ ఘటనలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బాంబు పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్ (ఐఎం)గా తేల్చింది.

ఐఎం సభ్యులు అనీక్‌ షఫీక్‌, మహ్మద్‌ తారీఖ్, రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, ఇస్మాయిల్‌ చౌదరి, షప్రుద్దీన్‌, మహ్మద్‌ షేక్‌, అమీర్‌ రజాఖాన్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారించిన సిట్ వారిపై చార్జిషీట్ దాఖలు చేసింది. వీరిలో ఐదుగురు ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. కేసును విచారించిన నాంపల్లి కోర్టు గత నెల 27నే తీర్పు వెలువరించాల్సి ఉన్నా చివరి నిమిషంలో తీర్పును నేటికి వాయిదా వేసింది. నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News