Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన వ్యాను.. 13 మంది దుర్మరణం

  • వరదలతో అల్లాడుతున్న ఉత్తరాఖండ్
  • విరిగిపడుతున్న కొండచరియలు
  • వంద అడుగుల లోయలో పడిన టెంపో

వరదలతో అల్లాడుతున్న ఉత్తరాఖండ్‌లో మరో భారీ ప్రమాదం జరిగింది. యాత్రికులతో వస్తున్న టెంపో ఒకటి ఉత్తరకాశీలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో అదుపు తప్పిన టెంపో వంద అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గత నెలలో ఇదే లోయ వద్ద జరిగిన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Uttarakhand
Road Accident
Tempo
Uttar kaashi
  • Loading...

More Telugu News