BigBoss: బిగ్‌బాస్‌లో ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది వీరే.. కౌశల్‌పై మారని సభ్యుల తీరు!

  • ముగింపు దశకు బిగ్‌బాస్ షో
  • కౌశల్‌ను ఏకాకిని చేస్తున్న ఇంటి సభ్యులు
  • ఎలిమినేషన్ నుంచి సామ్రాట్ సేఫ్ 

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో ముగింపు దశకు చేరుకుంటుండడంతో మరింత ఆసక్తిగా సాగుతోంది. షరా మామూలుగానే ఇంటి సభ్యులందరూ ఒక్కటై కౌశల్‌ను దూరం పెడుతున్నారు. అందరూ ఒకటి, అతనొక్కడు ఒకటిలా తయారైంది. అందరూ కలిసి అతడిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కౌశల్ ముందు ఒకలా, వెనక ఒకలా మాట్లాడుతూ ఏకాకిని చేస్తున్నారు.

మరోవైపు ఈ వారం నలుగురు సభ్యులు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఇంటి సభ్యుల్లో ఎక్కువమంది సామ్రాట్‌ను సేవ్ చేయడంతో అతడు ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. శ్యామల, అమిత్, దీప్తి, కౌశల్ ఎలిమినేషన్‌లో ఉన్నారు. కాగా, గతవారం బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన గీతామాధురి.. కౌశల్‌ను ఈ సీజన్ మొత్తం ఎలిమినేషన్‌కు నామినేట్ చేసింది.  

BigBoss
Star Maa
Actor Nani
kaushal
Geetha madhuri
shyamala
  • Loading...

More Telugu News