ntr: ఎన్టీఆర్ అంకితభావం చూసి మరింత గౌరవం పెరిగింది: తమన్

  • 'అరవింద సమేత' షూటింగులో ఎన్టీఆర్ 
  • అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్
  • ఆయన వెంట మేమంతా వున్నాం           

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అనుకోని ఈ సంఘటన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా షూటింగుపై ప్రభావం చూపుతుందని అంతా అనుకున్నారు. మానసికంగా ఎన్టీఆర్ కోలుకునేవరకూ ఈ సినిమా షూటింగ్ వాయిదా పడొచ్చని చెప్పుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండానే షూటింగుకి తిరిగి హాజరయ్యాడు.

తన కారణంగా షూటింగ్ ఆగిపోకూడదనీ .. విడుదల వాయిదా పడకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఎన్టీఆర్ .. తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'అంకితభావానికి ఎన్టీఆర్ నిలువెత్తు నిదర్శనం .. ఆయన డెడికేషన్ చూశాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది' అంటూ సంగీత దర్శకుడు తమన్ ఒక ట్వీట్ చేశాడు. 'మేమంతా మీతో వున్నాం .. మీకు మరింత బలం చేకూరాలి' అంటూ లొకేషన్లోని ఎన్టీఆర్ ఫోటోను పోస్ట్ చేశాడు.     

  • Error fetching data: Network response was not ok

More Telugu News