isis: ‘హిందూ’ నేతల హత్యకు ఐసిస్ కుట్ర.. ఐదుగురు సానుభూతిపరుల అరెస్ట్!

  • తమిళనాడులోని కోయంబత్తూరులో ఘటన
  • కోర్టులో హాజరుపరచిన పోలీసులు
  • వినాయక చవితి రోజు దాడికి ప్లాన్

తమిళనాడులోని కోయంబత్తూరులో ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) కలకలం చెలరేగింది. కోయంబత్తూరులో ఈ రోజు పోలీసులు ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. తమిళనాడులోని హిందూ మక్కల్ కట్చి(హెచ్ఎంకే) చీఫ్ అర్జున్ సంపత్ తో పాటు ఇతర నేతలను హత్యచేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రెండు వారాల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

కోయంబత్తూరులో అరెస్టయిన ఈ ఐదుగురు వినాయకచవితి సందర్భంగా అర్జున్ సంపత్ తో పాటు ఇతర అగ్ర నేతలను హత్య చేసేందుకు ప్రణాళిక రచించారని పోలీసులు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో అధికారులు రాష్ట్రమంతటా హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడులో ఉగ్రమూకలు ఆశ్రయం పొందుతున్నాయనీ, అవసరమైతే కేంద్రం సాయం చేస్తుందని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కొన్నిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.

isis
Tamilnadu
Police
hindu makkal katchi
  • Loading...

More Telugu News