paruchuri: అందుకే హరికృష్ణను ఒప్పించే ప్రయత్నం చేయలేదు: పరుచూరి గోపాలకృష్ణ

  • 'శివరామరాజు'లో అద్భుతంగా నటించాడు 
  • 'శ్రీరాములయ్య'లో నక్సలైట్ గా జీవించాడు 
  • ఆయన కోసం ఒక కథ రెడీ చేశాను     

ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలకి పనిచేయడం వలన, ఆ సినిమాల వ్యవహారాలు చూసుకునే హరికృష్ణతో పరుచూరి గోపాలకృష్ణకి ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి హరికృష్ణ హఠాత్తుగా చనిపోవడంతో పరుచూరి గోపాలకృష్ణ ఎంతగానో ఆవేదన చెందారు. "హరికృష్ణ నటించిన రెండు సినిమాలకి నేను పనిచేశాను .. ఒకటి 'శివరామరాజు' .. రెండు 'శ్రీరాములయ్య'. ఆయన 'శ్రీరాములయ్య'లో నక్సలైట్ గా అద్భుతంగా నటించాడు. ఇక 'శివరామరాజు'లో ఇచ్చిన మాట కోసం తల తీసేసుకునే పాత్రలో ఆయన నటనకి ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఒకసారి హరికృష్ణ .. కల్యాణ్ రామ్ ల కోసం ఒక కథ చెప్పాను. 'ఇది మా మీద వర్కౌట్ కాదు ప.గో' అన్నాడు. అయితే ఆ కథ ఆయనపై బాగా వర్కౌట్ అయ్యుండేదేమోనని నాకు ఇంకా అనిపిస్తూ వుంటుంది. అయితే ఒకసారి ఆయన అన్నగారిని ఎదిరించి మాట్లాడవద్దని చెప్పిన విషయం నాకు గుర్తుంది. అందువలన ఆయన ఒకసారి వర్కౌట్ కాదని అన్నప్పుడు ఆయనని ఎదురించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు" అంటూ చెప్పుకొచ్చారు.           

paruchuri
harikrishna
  • Loading...

More Telugu News