hair loose: జుట్టు ఊడిపోతోందన్న ఆవేదనతో ప్రాణాలు తీసుకున్న యువతి!

  • కర్ణాటకలోని మైసూరులో ఘటన
  • హెయిల్ స్టయిలింగ్ చేయించుకున్న నేహా
  • బ్యూటీపార్లర్ పై పోలీసుల కేసు

అందమైన కురులు కావాలని ఆశపడ్డ ఓ యువతి జుట్టును స్టయిలింగ్ చేయించుకుంది. అయితే ఆ తర్వాత జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉండటంతో మనస్తాపానికి లోనైన యువతి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో చోటుచేసుకుంది.

నేహా గంగమ్మ అనే యువతి మైసూరులోని ఓ కళాశాలలో బీబీఏ చదువుతోంది. ఇక్కడే స్థానికంగా ఉన్న హాస్టల్ లో ఉంటూ చదువును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో జుట్టును మరింత స్టయిల్ గా మార్చుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. కానీ స్టయిలింగ్ తర్వాత ఆమె జుట్టు విపరీతంగా రాలిపోవడంతో పాటు చర్మ సంబంధిత సమస్యలు తలెత్తాయి.

తన జుట్టు ఊడిపోతోందనీ, మరో ఏడాది పాటు తాను కళాశాలకు వెళ్లలేనని నేహా తల్లికి ఫోన్ చేసి బాధపడింది. జుట్టు ఊడిపోవడంతో స్నేహితులు అడుగుతున్న ప్రశ్నలతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. ఇక్కడి లక్ష్మతీర్థ నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. నేహా మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

hair loose
mysoor
Karnataka
women suicide
beauty parlour
  • Loading...

More Telugu News