Marriage: 'కుమారస్వామితో వియ్యం'... వార్తపై స్పందించిన ప్రాఫిట్ షూ అధినేత కోటేశ్వరరావు!

  • పెళ్లి మాటలు లేవు
  • ఆయన్ను భోజనానికి పిలిచామంతే
  • తమ కుటుంబానికి కుమారస్వామి మిత్రుడన్న కోటేశ్వరరావు

గత వారంలో కర్ణాటక సీఎం కుమారస్వామి విజయవాడకు వచ్చిన వేళ, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బి.శివ కోటేశ్వరరావు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. తన కుమారుడు నిఖిల్ గౌడకు కోటేశ్వరరావు కుమార్తెతో వివాహం జరిపించే నిమిత్తం ఆయన వచ్చారని వార్తలు వచ్చాయి. పెళ్లి చూపుల కోసమే కోటేశ్వరరావు ఇంటికి కుమారస్వామి వెళ్లారని కథనాలు రాగా, వాటిపై ఆయన స్పందించారు.కుమారస్వామితో తనకు మంచి అనుబంధం ఉందని, ఆయన తమ కుటుంబ మిత్రుడని కోటేశ్వరరావు చెప్పారు. ఆయన విజయవాడకు వచ్చిన కారణంగా, తన ఇంట్లో భోజనం చేయాలని కోరానని, స్నేహాన్ని కాదనలేక ఆయన వచ్చారే తప్ప, ఎటువంటి పెళ్లి ప్రస్తావనా లేదని ఆయన చెప్పారు. కాగా, శుక్రవారం నాడు విజయవాడకు వచ్చిన కుమారస్వామి, కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం కోటేశ్వరరావు ఇంటికి వెళ్లారు.

Marriage
Vijayawada
BS Koteshwara Rao
Kumaraswamy
  • Loading...

More Telugu News