CPI Narayana: అత్యంత చెత్తగా, చప్పగా, నిస్సత్తువగా సాగిన కేసీఆర్ ప్రసంగం ఇదొక్కటే: సీపీఐ నారాయణ

  • కొడుకును సీఎం చేయాలని వ్యూహం పన్నిన కేసీఆర్
  • అది చెప్పేందుకే ఈ సభ ఏర్పాటు
  • ప్రధానితో సమావేశం తరువాత మారిన పరిస్థితి

ఎప్పుడు ఎక్కడ ప్రసంగించినా, ప్రజల నుంచి చప్పట్లు వచ్చేలా మాట్లాడే కేసీఆర్, నిన్నటి ప్రగతి నివేదన సభలో మాత్రం నిస్సత్తువగా మాట్లాడారని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగాల్లో అత్యంత చెత్తగా, చప్పగా సాగిన ప్రసంగం ఇదేనని అభిప్రాయపడ్డ ఆయన, పుత్ర రత్నాన్ని సీఎం పదవిలో కూర్చోబెట్టి, తాను ఢిల్లీలో చక్రం తిప్పాలన్న వ్యూహం పన్నిన కేసీఆర్, అందుకు ఈ సభను వేదికగా చేసుకుందామని భావించి, విఫలం అయ్యారని వ్యాఖ్యానించారు.  

తానిచ్చిన హామీల్లో 30 శాతం కూడా నెరవేర్చలేకపోయిన ఆయన, కొత్త హామీలను ఇవ్వని కారణమదేనని విశ్లేషించారు. అనుకున్న స్థాయిలో ప్రగతి నివేదన సభకు జనం రాలేదని, ఇక కేసీఆర్ పతనం ప్రారంభమైనట్టేనని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టుగా ఈ సభలో చెప్పాలన్నది రెండు వారాల క్రితం కేసీఆర్ ఆలోచనని, ప్రధానితో సమావేశం తరువాత పరిస్థితి మారిపోయిందని ఆయన అన్నారు.

CPI Narayana
KCR
Pragati Nivedana
  • Loading...

More Telugu News