K Nageshwar: కేసీఆర్ ది సింగిల్ ఎపిసోడ్ కాదు... ఇదే కొంగర కలాన్ రహస్యం: ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ

  • దాదాపు గంటపాటు ప్రసంగించిన కేసీఆర్
  • సభను విశ్లేషించిన ప్రొఫెసర్ నాగేశ్వర్
  • హైప్ కారణంగానే సభపై విమర్శలు

నిన్న కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో, దాదాపు గంటపాటు ప్రసంగించిన కేసీఆర్, ఏ విధమైన కొత్త పథకాలుగానీ, అందరూ అనుకున్నట్టుగా ముందస్తు ఎన్నికలపైగానీ, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రగతి నివేదన సభను విశ్లేషించిన ప్రొఫెసర్ కే నాగేశ్వర్, గత రెండు వారాలుగా ముందస్తు, కొత్త పథకాలపై ఎంతో హైప్ సృష్టించబడింది కాబట్టే, కొంగరకలాన్ సభపై కొన్ని విమర్శలు వస్తుండవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్త సంక్షేమ పథకాల ఊసు లేదని విమర్శలు వచ్చినా, అవి తాత్కాలికమేనన్నారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్, చాలా తెలివైన రాజకీయ నేతని వ్యాఖ్యానించిన నాగేశ్వర్, ఆయన ఒక రోజు సీరియల్ తియ్యరని అన్నారు. మీడియాను మేనేజ్ చేయడంలో కేసీఆర్ దిట్టని, కేవలం ఒక్క సమావేశంతోనే సస్పెన్స్ వీడిపోయేలా ఆయనెన్నడూ ప్రవర్తించరని చెప్పారు. తనలోని టాలెంట్ ను ఆయన మరోసారి ప్రదర్శించారని అన్నారు. నేడే ముందస్తు ప్రకటిస్తే, అది హెడ్ లైన్ అవుతుందే తప్ప, 'ప్రగతి నివేదన' పక్కకెళ్లిపోతుందని చెప్పిన నాగేశ్వర్, రేపటి హెడ్ లైన్స్ ను ముందే నిర్ణయించుకున్న కేసీఆర్, అందుకు తగ్గట్టుగా ట్రైలర్ ను చూపిస్తూ, రాజకీయ నిర్ణయాలు త్వరలో ఉంటాయని చెబుతూ, అసలు సినిమా ముందుందని చెప్పకనే చెప్పారని, కొంగరకలాన్ సభ రహస్యమదేనని అన్నారు.

K Nageshwar
KCR
Suspence
  • Error fetching data: Network response was not ok

More Telugu News