Devansh: చిన్ని కృష్ణుడిగా దేవాన్ష్... ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్

  • దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
  • తెలుగు ప్రజలకు లోకేశ్ శుభాకాంక్షలు
  • దేవాన్ష్ ను కృష్ణుడిగా అలంకరించి ముచ్చట

దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్న వేళ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "గిరిని సైతం గోటితో లేపినా, తులసీ దళానికే తేలిపోయాడట! ఆయుధం పట్టలేదు కానీ అసుర సంహారం ఆపలేదట! అందరికీ ఆదర్శప్రాయమైన ఆ శ్రీ కృష్ణ భగవానుని స్మరిస్తూ, తెలుగు ప్రజలందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు!" అని చెబుతూ, తన కుమారుడు దేవాన్ష్ ను కృష్ణుడిగా అలంకరించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. లోకేశ్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News