Dharmana Prasad: సింపుల్‌గా వైసీపీ నేత ధర్మాన కుమారుడి వివాహం.. అన్నవరంలో ఒక్కటైన జంట!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-fe2f31de7692f07626c483d0cc54629ee31a6d16.jpg)
- సత్యదేవుని సన్నిధిలో వివాహం
- వధువు సుశ్రీ మెడలో తాళికట్టిన వరుడు రామ్ మనోహర నాయుడు
- ఆశీర్వదించిన వైసీపీ నేతలు
వైసీపీ నేత, శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడి వివాహం ఆదివారం రాత్రి అన్నవరం కొండపై సింపుల్‌గా జరిగింది. సత్యగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో ఉన్న హరిహర సదన్ ప్రాంగణంలో వరుడు రామ్ మనోహర నాయుడు-వధువు సుశ్రీలు ఒక్కటయ్యారు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.