pragathi nivedana sabha: హైదరాబాదుకు వచ్చిన ట్రాక్టర్లన్నీ ఈ రాత్రికి ఇక్కడే: డీజీపీ

  • ట్రాక్టర్లన్నీ రేపు ఉదయం వెళ్లాలి
  • ముందు ప్రకటించిన రూట్లోనే అందరూ వెళ్లాలి
  • ట్రాఫిక్ కు అంతరాయం కల్పించవద్దు

ప్రగతి నివేదన సభకు వచ్చిన ట్రాక్టర్లన్నింటినీ ఈ రాత్రికి ఇక్కడే ఉంచుతామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం వాటిని పంపిస్తామని చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సభ పూర్తయిన తర్వాత ముందు ప్రకటించిన రూట్లలోనే వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా ఎవరూ ప్రవర్తించవద్దని కోరారు. సభ పూర్తయిన తర్వాత అందరూ క్షేమంగా తమ స్వస్థలాలకు చేరుకోవాలని చెప్పారు. 

pragathi nivedana sabha
dgp
mahender reddy
traffic
  • Loading...

More Telugu News