kavitha: వేదిక వద్ద అన్నయ్యతో సెల్ఫీ దిగిన కవిత!

  • ప్రగతి నివేదన సభ వద్ద కవిత సందడి
  • అందరినీ పలుకరిస్తూ, కలియతిరుగుతున్న ఎంపీ
  • భారీ సభలను నిర్వహించడంలో టీఆర్ఎస్ ది చరిత్ర అన్న కవిత

ప్రగతి నివేదన సభ వద్ద టీఆర్ఎస్ ఎంపీ కవిత సందడి చేస్తున్నారు. ప్రాంగణమంతా కలియతిరుగుతూ, అందరినీ పలకరిస్తూ హుషారుగా ఉన్నారు. ఈ సందర్భంగా తన అన్నయ్య కేటీఆర్ తో ఆమె సెల్ఫీ దిగారు. మరోవైపు, మీడియాతో ఆమె మాట్లాడుతూ, సభలో కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలను వినడానికి లక్షలాది మంది ప్రజలతో పాటు తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. భారీ బహిరంగ సభలను నిర్వహించడంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని తెలిపారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఏమేం చేశామో కేసీఆర్ సవివరంగా తెలియజేస్తారని చెప్పారు.

kavitha
KTR
selfie
pragathi nivedana sabha
  • Loading...

More Telugu News