kcr: మళ్లీ కేసీఆరే సీఎం అనే విషయం మోదీ, రాహుల్ గాంధీలకు తెలుసు: కేటీఆర్

  • రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయం
  • ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు
  • రానున్న ఐదేళ్లలో ఏం చేయబోతున్నామో కేసీఆర్ చెబుతారు

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారనే విషయం ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు తెలుసని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఏమేం చేయబోతున్నామో ప్రగతి నివేదన సభలో కేసీఆర్ చెబుతారని అన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. 

kcr
KTR
pragathi nivedana sabha
modi
Rahul Gandhi
  • Loading...

More Telugu News