KTR: కొంగరకలాన్ లో డోలు వాయిస్తూ సందడి చేసిన కేటీఆర్.. వీడియో చూడండి

  • డోలు వాయిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచిన కేటీఆర్
  • భుజాలకు ఎత్తుకుని అభినందించిన కార్యకర్తలు
  • సభ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్న కేటీఆర్

కొంగరకలాన్ లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. కళాకారులతో కలసి డోలు వాయిస్తూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. డోలు ఎలా వాయించాలో రసమయి బాలకిషన్ చెప్పడంతో, దానికి అనుగుణంగా డోలును వాయిస్తూ, ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా పక్కనున్న కార్యకర్తలు ఆయనను భుజాలపైకి ఎత్తుకొని అభినందించారు. సభ ఏర్పాట్లను కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హజరుకాలేదు. సభకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలకుండా, ఏర్పాట్లన్నింటినీ ఆయన పర్యవేక్షిస్తున్నారు.

KTR
dolu
drums
pragathi nivedana sabha
  • Error fetching data: Network response was not ok

More Telugu News