ys rajasekhar reddy: వర్ధంతి సందర్భంగా వైయస్సార్ ను స్మరించుకున్న చంద్రబాబు!

  • నేడు వైయస్ వర్ధంతి
  • తన మిత్రుడిని గుర్తు చేసుకున్న చంద్రబాబు
  • పార్టీలు వేరైనా.. ఇద్దరి మధ్య చెరగని స్నేహం

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు స్మరించుకున్నారు. 'మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.

చంద్రబాబు, వైయస్ ల మధ్య మంచి స్నేహబంధం ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకే సమయంలో ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చి, తమదైన ముద్ర వేశారు. తదనంతర కాలంలో చంద్రబాబు టీడీపీలోకి వచ్చినా... ఇద్దరి మధ్య స్నేహం తెగిపోలేదు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో ఇద్దరు నేతల మధ్య ఎంతో ఆసక్తికరంగా చర్చ కొనసాగేది. ఈ నేపథ్యంలోనే వర్ధంతి సందర్భంగా తన మిత్రుడిని చంద్రబాబు మరోసారి గుర్తు చేసుకున్నారు.

ys rajasekhar reddy
Chandrababu
  • Loading...

More Telugu News