ysr: ‘నిన్ను నీవే జయించిరారా రాజశేఖరా’.. అదరగొడుతున్న ‘యాత్ర’ పాట లిరిక్స్

  • విడుదల చేసిన చిత్ర యూనిట్
  • వైఎస్సార్ పాదయాత్రపై గీతం
  • 9వ వర్ధంతి సందర్భంగా విడుదల

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా యాత్ర సినిమా యూనిట్ ‘'సమర శంఖం’ అనే పాటను లిరిక్స్ తో విడుదల చేసింది. ఇందులో వైఎస్సార్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టి వేలాది కార్యకర్తలతో కలసి పాదయాత్రలో ముందుకు దూసుకుపోతున్నాడు.

‘నీ కనులలో కొలిమై.. రగిలే కలేదో నిజమై తెలవారనీ.
వెతికే వెలుగై రానీ
ఈనాటి ఈ సుప్రభాత గీతం నీకిదే అన్నది స్వాగతం
ఈ సంధ్యలో స్వర్ణ వర్ణ చిత్రం చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం
ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనది
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించి రారా రాజశేఖరా’ అంటూ పాట అదరగొడుతోంది.


ఈ సినిమాకు మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించగా, కృష్ణ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. యాత్రను 2019, జనవరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.


ysr
yatra
movie
Tollywood
january 2019
song
lyrics
  • Error fetching data: Network response was not ok

More Telugu News