pavan kalyan: పవన్ కల్యాణ్ పుట్టినరోజు.. స్పెషల్ వీడియో విడుదల చేసిన జనసేన!

  • కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చాడు
  • ప్రళయకాల రుద్రుడికి తోడుందాం
  • జన సైనికులకు పార్టీ పిలుపు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఆ పార్టీ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. జనసేనకు చెందిన శతాగ్ని టీమ్ దీన్ని రూపొందించింది. పవన్ ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు? ఆయన లక్ష్యం ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? అంశాలపై జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులను ఉద్దేశించి ప్రత్యేకమైన వీడియోను ఈ రోజు రిలీజ్ చేసింది.

‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను మంట కలిపి రాజకీయ విలువలను భూస్థాపితం చేశారు. ఇదంతా చూసిన ఓ సామాన్యుడి కడుపు మండింది. అతను ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతను అనుకోకుండా సినిమా నటుడు అయ్యాడు. అగ్రనటుడి స్థాయి అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు.. బాధ్యతను ఇచ్చాయి. అదే జనసేన’ అంటూ వాయిస్ ఓవర్ తో వీడియో సాగుతోంది.

పవన్ ప్రసంగాలు, సినిమా క్లిప్స్ తో ఈ వీడియోను రూపొందించారు. ‘జనసేన గెలుపు సామాన్యుల గెలుపు, జనసేన ఓడితే.. సామాన్యులు ఓడినట్లే. జనసైనికులరా రాక్షస రాజ్యం తలపెట్టిన ఈ తొలి యుద్ధానికి శతఘ్నులమై సంసిద్ధమవుదాం. అవినీతి అంతం చేసేందుకు ఎర్రటి వస్త్రాన్ని మెడలో వేసుకుని నడిచే ప్రళయ కాల రుద్రుడికి అడుగవుదాం’ అని వీడియోలో ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ జనసేన స్పెషల్ వీడియో చూసేయండి.

pavan kalyan
janasena
tribute video
birthday video
satagni team
  • Error fetching data: Network response was not ok

More Telugu News