KCR: కేబినెట్ మీటింగ్ కు రావద్దు... సభ ఏర్పాట్లు చూడండి.. కేటీఆర్, మహేందర్ రెడ్డిలకు కేసీఆర్ ఆదేశం!

  • ఒంటిగంటకు కేబినెట్ సమావేశం
  • సభా స్థలిలోనే ఉండండి
  • ఇద్దరు మంత్రులకూ కేసీఆర్ ఆదేశం

ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనున్న కేబినెట్ సమావేశానికి మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డిలు హాజరు కానవసరం లేదని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి సమాచారాన్ని అందించిన అధికారులు, సమావేశం నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. నేడు జరిగే ప్రగతి నివేదన సభ వద్ద నిన్నటి నుంచి ఉన్న వీరిద్దరూ, ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తుండగా, వారు అక్కడే ఉండాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. సభకు భారీగా తరలివస్తున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా చూసుకోవాలని కూడా ఆయన వెల్లడించారు. సభ నిర్వహణ ఇన్ చార్జ్ లుగా కేటీఆర్, మహేందర్ రెడ్డిలు ఉన్న సంగతి తెలిసిందే.

KCR
TRS
Kongarakalan
KTR
Mahender Reddy
  • Loading...

More Telugu News