Kadapa District: కడప జిల్లాలో కలకలం... రైలు కింద పడ్డ ప్రేమజంట, ప్రియుడి మృతి!

  • కడపకు వచ్చిన విజయవాడ యువకుడు
  • ఆపై ప్రేయసిని తీసుకుని రాజంపేటకు
  • ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ప్రియురాలు

వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు కాదన్నారో లేక మరేదైనా సమస్య వచ్చిందో... కలసి తనువు చాలించాలని భావించారు. ఇద్దరూ కలసి రైలు కింద పడగా, ప్రియుడు అక్కడికక్కడే మరణించగా, ప్రియురాలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన సిద్ధయ్య అనే యువకుడు, కడపకు చెందిన కాసింబీని గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో సిద్ధయ్య కడపకు వచ్చి కాసింబీని కలిశాడు. ఇద్దరూ కలిసి రాజంపేటకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలతో పడివున్న కాసింబీని చూసిన కొందరు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

Kadapa District
Rajampeta
Train
Sucide
Lovers
  • Loading...

More Telugu News