Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం పొర్లుదండాలతో తిరుమల కొండకు చేరిన అభిమాని!

  • నేడు పవన్ పుట్టిన రోజు
  • పొర్లు దండాలతో కొండకు చేరిన ఈశ్వర్
  • ఎన్నికల్లో జనసేన గెలవాలని కోరిక

నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఓ అభిమాని పొర్లు దండాలు పెడుతూ తిరుమల కొండకు చేరుకున్నాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుతూ,  చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లికి చెందిన ఈశ్వర్‌ రాయల్‌ అనే యువకుడు పొర్లుదండాలతో కొండకు వచ్చాడు. శ్రీవారి మెట్టు మార్గంలోని 2,600 మెట్లను తన స్నేహితుల సాయంతో ఎక్కిన ఈశ్వర్, తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ సత్తా చాటాలని, 2019లో ఆయన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ యాత్ర చేశానని ఈశ్వర్‌ అన్నాడు.

Pawan Kalyan
Birth Day
Tirumala
Eswar
Fan
  • Loading...

More Telugu News