Kongarakalan: 'ప్రగతి నివేదన'ను నిశితంగా పరిశీలిస్తున్న అమెరికా... పౌరులకు హెచ్చరికలు!

  • నేడు కొంగరకలాన్‌ లో భారీ బహిరంగ సభ
  • వెబ్ సైట్లో వివరాలు ఉంచిన యూఎస్ ఎంబసీ
  • రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు కొంగరకలాన్‌ లో జరగనున్న భారీ బహిరంగ సభను హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ నిశితంగా గమనిస్తోంది. సభకు సంబంధించిన వివరాలను, తమ అధికారిక వెబ్ సైట్లో ఉంచిన యూఎస్ ఎంబసీ, తమ దేశ పౌరులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతూ, విమానాశ్రయానికి వెళ్లే మార్గాలన్నీ జనంతో నిండిపోయే అవకాశం ఉందని తెలిపింది. ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని, దీంతో కొన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్టుకు చేరుకోవడం కష్టం కావచ్చని అభిప్రాయపడింది. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టాలని చెబుతూ అమెరికన్లను యూఎస్ ఎంబసీ హెచ్చరించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News