cpi ramakrishna: నరేంద్ర మోదీ ఓ పెద్ద బ్రోకర్: సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

  • కార్పొరేట్ బ్రోకర్లను మోదీ విదేశాలకు తీసుకెళుతున్నారు
  • ‘రాఫెల్’ కుంభకోణానికి మోదీయే కారణం
  • మోదీ పాలనలో లక్షల కోట్ల బ్లాక్ మనీ వైట్ గా మారింది

ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెద్ద బ్రోకర్ అని సీపీఐ ఏపీ రాష్ట్ర నేత రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో పనులున్న వాళ్లు ఆర్ఎస్ఎస్ నేతలకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారని, కార్పొరేట్ బ్రోకర్లను మోదీ విదేశాలకు తీసుకెళుతున్నారని, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణానికి మోదీయే కారణమని ఆరోపించారు. మోదీ పాలనలో లక్షల కోట్ల బ్లాక్ మనీ వైట్ మనీగా మారిందని, ఏపీకి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు.

cpi ramakrishna
modi
  • Loading...

More Telugu News