TRS: కొంగరకలాన్ లో భారీ వర్షం.. తడిసి ముద్దయిన టెంట్లు!

  • తడిసిముద్దయిన ప్రగతి నివేదన సభా ప్రాంగణం
  • ఇప్పటికే అక్కడికి చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు
  • ప్రగతి నివేదన సభకు భారీ బందోబస్తు ఏర్పాటు

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం వర్షం కురిసింది. రేపు టీఆర్ఎస్ నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రాంతమైన కొంగరకలాన్ లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో, టెంట్లు తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే, టీఆర్ఎస్ కార్యకర్తలు, కళాకారులు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

కాగా, ప్రగతి నివేదన సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రతీ పోలీస్ స్టేషన్ నుంచి 40 మంది సిబ్బందికి ఇక్కడ డ్యూటీ వేశారు. రెండు రోజుల పాటు హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి లారీల ప్రవేశాన్ని నిషేధించారు. ప్రగతి నివేదన సభకు ఓఆర్ఆర్ నుంచి 19 మార్గాల ద్వారా వెళ్లొచ్చు. ఏ నియోజకవర్గం వారు ఏ వైపు నుంచి రావాలో సూచిస్తూ పోలీసులు ఇప్పటికే వివరంగా పేర్కొన్నారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ కు ప్రగతి నివేదన సభ ట్రాఫిక్ బాధ్యతలు అప్పగించారు.

TRS
kongara kalan
  • Loading...

More Telugu News