kcr: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తాం: ఉత్తమ్
- కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది
- ప్రగతి నివేదన సభకు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం కొల్లగొడుతోందని ఆరోపించారు. కేసీఆర్ నిర్వహిస్తున్నది ప్రగతి నివేదన సభ కాదని, ప్రగతి ఆవేదన సభ అని ఎద్దేవా చేశారు. ఈ సభ పేరుతో ధన ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు. సభ కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.