kerala: యూఏఈ సాయం అందుతుందని ఆశ పెట్టుకున్నాం: కేరళ ముఖ్యమంత్రి

  • కేంద్రం వైఖరి ఇలాగే ఉంటుందని అనుకోవడం లేదు
  • రాష్ట్రాన్ని ఆదుకునేందుకు చాలా దేశాలు ముందుకు వచ్చాయి
  • కేంద్ర సాయానికి కొన్ని పరిమితులు ఉంటాయి

జల ప్రళయంతో అతలాకుతలమైన తమ రాష్ట్రానికి యూఏఈ నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఆశిస్తున్నట్టు కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. వరద బాధితుల సహాయ కార్యకలాపాలను సమన్వయంతో నిర్వహించిన ఐఏఎస్ అధికారులను ఈ రోజు ఆయన సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేరళను ఆదుకునేందుకు చాలా దేశాలు ముందుకు వచ్చాయని చెప్పారు. యూఏఈ ప్రకటించినట్టు చెబుతున్న రూ. 700 కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్టు వచ్చిన వార్తల గురించి ఆయన మాట్లాడుతూ, కేంద్రం వైఖరి ఇదే విధంగా కొనసాగుతుందని తాను భావించడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయానికి కొన్ని పరిమితులు ఉంటాయని... అందువల్ల రాష్ట్రమే వనరులను అన్వేషించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

  • Loading...

More Telugu News