Chandrababu: భయపడొద్దు తమ్మూడూ.. పెద్ద దిక్కుగా నేనున్నా!: రామ్మూర్తి నాయుడికి ధైర్యం చెప్పిన చంద్రబాబు

  • చిత్తూరులో పర్యటిస్తున్న ఏపీ సీఎం
  • తమ్ముడు రామ్మూర్తి ఇంటికెళ్లిన బాబు
  • స్థానికులతో మాట్లాడి సెల్ఫీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు తిరుపతి సమీపంలోని చెర్లోపల్లిలోని తన తమ్ముడు రామ్మూర్తి నాయుడి ఇంటికి వెళ్లారు.

అధికారులను బయటే ఉండమని చెప్పిన చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి తమ్ముడు రామ్మూర్తి నాయుడితో పాటు ఆయన కుమారుడు, హీరో నారా రోహిత్ తో మాట్లాడారు. తమ్ముడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా తాను ఉన్నాననీ, భయపడవద్దని చంద్రబాబు తమ్ముడికి ధైర్యం చెప్పారు. దాదాపు 20 నిమిషాల సేపు చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడిపారు. అనంతరం బయటికొచ్చిన సీఎం.. చుట్టుపక్కల వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు విజ్ఞప్తి చేయడంతో చంద్రబాబు వారితో సెల్ఫీలు దిగారు.

Chandrababu
brother
nara rohit
rammurthy naidu
Chittoor District
tour
Chief Minister
  • Loading...

More Telugu News