mumbai: మద్యం మత్తులో పోలీసులపై యువతుల వీరంగం.. వైరల్ గా మారిన వీడియో!

  • మహారాష్ట్రలోని పింప్రీలో ఘటన
  • మద్యం మత్తులో డ్రైవింగ్
  • పోలీసులపై యువతి బూతుపురాణం

మహారాష్ట్రలో మందుకొట్టిన ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ చేశారు. మద్యం మత్తులో కారు నడుపుతుండడంతో జరిమానా విధించిన అధికారులపై సదరు యువతులు రెచ్చిపోయారు. కోపంతో ఊగిపోతూ ఏకంగా పోలీస్ అధికారిపైకే దూసుకొచ్చేశారు. పక్కనే ఉన్న  మహిళా కానిస్టేబుల్ సముదాయించినా వీరు ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

రాష్ట్రంలోని పూణే సమీపంలోని పింప్రీ ప్రాంతంలో ఇద్దరు యువతులు మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వీరిని స్టేషన్ కు తీసుకొచ్చారు. తర్వాత ఇద్దరు యువతులు అక్కడ నానా హంగామా సృష్టించారు. వీరిలో ఓ యువతి అయితే సీనియర్ పోలీస్ అధికారిని బండబూతులు తిడుతూ అతనిపై దాడిచేసేందుకు దూసుకొచ్చింది. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్, మరో యువకుడు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. వీరిద్దరూ డ్యాన్సర్లుగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ వీడియోను రికార్డు చేసిన ఒకరు ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

mumbai
Drunk Driving
girls
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News