vegetables: ‘ప్రత్యూష’ కోసం రోడ్డుపై కూరగాయలు అమ్మిన నటి సమంత!

  • చెన్నైలో కూరగాయలు అమ్మిన సమంత
  • కొనేందుకు ఎగబడిన జనం
  • గుండె సంబంధిత వ్యాధుల కోసం నిధుల సమీకరణ

ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రముఖ నటి సమంత అక్కినేని తాజాగా చెన్నైలో రోడ్డుపై కూరగాయలు విక్రయించింది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ఆపరేషన్ కోసం నిధులు సేకరిస్తున్న సమంత రెండు రోజుల క్రితం చెన్నై చేరుకున్నారు.

నిధుల సమీకరణలో భాగంగా గురువారం సాయంత్రం ట్రిప్లికేన్‌లోని జామ బజార్‌కు చేరుకున్న ఆమె అక్కడే రోడ్డుపై కూరగాయల దుకాణం ముందు కూర్చుని దుకాణ యజమానికి తానొచ్చిన విషయం గురించి వివరించారు. ఆమెను చూసిన జనం దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. అంతే, కూరగాయలు కొనేందుకు ఎగబడ్డారు. ధర కోసం ఆలోచించకుండా కూరగాయలు కొని తమ వంతు సాయం అందించారు. కూరగాయలు తూకం వేస్తున్న సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

vegetables
Chennai
Samantha Akkineni
Akkineni Nagarjuna
Naga Chaitanya
  • Loading...

More Telugu News