India post: నేటి నుంచి అందుబాటులోకి పోస్టల్ బ్యాంకింగ్ సేవలు.. ఎయిర్‌టెల్, పేటీఎంలకు గట్టిపోటీ!
- నేడు ప్రారంభించనున్న ప్రధాని
- తక్షణం 650 శాఖల్లో అందుబాటులోకి
- మారుమూల గ్రామాల ప్రజలకూ బ్యాంకింగ్ సేవలు
నేటి నుంచి పోస్టల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీలోని తాల్కటోరా మైదానంలో ప్రధాని నరేంద్రమోదీ నేడు ఈ సేవలను ప్రారంభించనున్నారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం సేవలు తక్షణం అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 650 శాఖల్లో అందుబాటులోకి రానున్న ఈ సేవలు ఎయిర్‌టెల్, పేటీఎం వంటి పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలకు గట్టిపోటీ ఇవ్వగలవని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో సామాన్యులను వేగంగా భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పోస్టల్ బ్యాంకు సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ బ్యాంకు ద్వారా దేశంలోని అత్యంత మారుమూల గ్రామాల ప్రజలకు కూడా బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. ఈ ఏడాది డిసెంబరు మాసాంతానికి దేశవ్యాప్తంగా మొత్తం 1.55 లక్షల పోస్టాఫీసులకు ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకుల్లో లభించే అన్ని సేవలు పోస్టల్ బ్యాంకింగ్‌లోనూ లభించనున్నాయి.