Karnataka: కర్ణాటక సీఎం కుమారస్వామి కోడలిగా విజయవాడ అమ్మాయి.. సంబంధం ఫిక్స్!

  • ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కుమార్తెతో నిఖిల్‌కు పరిచయం
  • ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయం
  • విషయాన్ని గోప్యంగా ఉంచిన ఇరు కుటుంబాలు

కర్ణాటకకు, ఆంధ్రప్రదేశ్‌కు వియ్యం కుదరబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే బెజవాడ అమ్మాయి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కోడలు అవుతుంది. శుక్రవారం విజయవాడ చేరుకున్న కుమారస్వామి దంపతులు దుర్గమ్మను సందర్శించుకున్నారు. అధికారికంగా వారు ‘అమ్మ’ను దర్శించుకునేందుకే వచ్చినా.. అనధికారికంగా వారు తమ కుమారుడు నిఖిల్ గౌడకు పెళ్లి సంబంధం కోసమే వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడకే చెందిన పాదరక్షల కంపెనీ యజమాని కుమార్తెను చూసేందుకే వారు వచ్చినట్టు సమాచారం.

ఈ వార్తలను ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కోటేశ్వరరావు ఖండించినప్పటికీ అదే వాస్తవమని తెలుస్తోంది. కుమారస్వామి తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అందుకే భోజనానికి పిలిచినట్టు ఆయన వివరణ ఇచ్చారు. అయితే, వాస్తవం అదికాదని, ఆయన కుమార్తెను తమ కుమారుడికి అడగడానికే వచ్చినట్టు తెలుస్తోంది. కోటేశ్వరరావు కుమార్తెతో నిఖిల్‌కు రెండేళ్ల క్రితమే బెంగళూరులో పరిచయం అయినట్టు సమాచారం. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో వారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందులో భాగంగానే కాబోయే కోడలిని చూసేందుకు కుమారస్వామి దంపతులు విజయవాడ వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, పెళ్లి చూపుల విషయాన్ని ఇరు కుటుంబాల వారు గోప్యంగా ఉంచారు.

Karnataka
Kumaraswamy
Vijayawada
profit shoes company
Nikhil
  • Loading...

More Telugu News