Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు ప్రాణత్యాగం!

  • దొడ్డి త్రినాథ్ (28) ఉరేసుకుని ఆత్మహత్య
  • విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి మండలంలో సంఘటన
  • సెల్ టవర్ కు ఉరేసుకుని ఆత్మహత్య

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మరో యువకుడు ప్రాణత్యాగం చేశాడు. రాజమండ్రికి చెందిన యువకుడు దొడ్డి త్రినాథ్ (28) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ దగ్గర ఉన్న సెల్ టవర్ కు ఉరేసుకున్నాడు. సంఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు త్రినాథ్ తన సూసైడ్ నోట్ లో పేర్కొనడం గమనార్హం. నాడు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చూపిన శ్రద్ధ ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కూడా చూపించాలని తన సూసైడ్ నోట్ లో చంద్రబాబును కోరాడు.

Andhra Pradesh
Special Category Status
suicide
  • Loading...

More Telugu News