hari krishna: ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ.. మండిపడుతున్న నెటిజన్లు!

  • నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో సంఘటన
  • భౌతికకాయం వద్ద సెల్ఫీ దిగిన ఆసుపత్రి సిబ్బంది
  • ఆ సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వైనం

నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురవడం, నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన మృతి చెందడం తెలిసిందే. అయితే, హరికృష్ణ ఆసుపత్రిలో మృతి చెందిన అనంతరం ఆయన భౌతికకాయం వద్ద నిలబడి ఆసుపత్రి స్టాఫ్ సెల్ఫీలు దిగారు. ఈ సెల్ఫీలలో ఒక దానిని సామాజిక మాధ్యమాలలో వారు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియదా?’, ’మానవత్వం మంటగలిసింది!’ అని మండపడ్డ నెటిజన్లు, ‘కనీస ఇంగితజ్ఞానం లేదా?’ అంటూ చీవాట్లు పెడుతున్నారు.

hari krishna
kamineni hospital
selfie
  • Loading...

More Telugu News