chaithu: అదరగొట్టేస్తోన్న 'శైలజా రెడ్డి అల్లుడు' ట్రైలర్

  • చైతూ సరసన అను ఇమ్మాన్యుయేల్ 
  • పవర్ఫుల్ అత్త రోల్ లో రమ్యకృష్ణ 
  • వచ్చేనెల 13వ తేదీన విడుదల   

ఆకట్టుకునే కథలను .. ఆసక్తికరమైన కథనాలను సిద్ధం చేసుకోవడంలో దర్శకుడు మారుతికి మంచి అనుభవముంది. తాజాగా ఆయన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాను రూపొందించాడు. చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో, హీరోకి అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ప్రధానమైన పాత్రలైన చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. రమ్యకృష్ణ .. సీనియర్ నరేశ్ .. పృథ్వీ .. మురళీశర్మ .. వెన్నెల కిషోర్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీకి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంది. చారి పాత్రలో వెన్నెల కిషోర్ .. మాణిక్యం పాత్రలో పృథ్వీ కామెడీని బాగా వర్కౌట్ చేసినట్టుగా అనిపిస్తోంది. 'నాలాగే నీకూ ఈగో ఎక్కువని విన్నాను .. దాని దమ్మేంటో చూడాలని వుంది' అంటూ రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ ను వింటుంటే, అత్తగారి పాత్రలో ఆమె అదరగొట్టేయడం ఖాయమనిపిస్తోంది. 

chaithu
anu
ramyakrishna
  • Error fetching data: Network response was not ok

More Telugu News