Chandrababu: కాంగ్రెస్ నేతలతో ఇబ్బందులపై త్వరలోనే చర్చిద్దాం: కుమారస్వామితో చంద్రబాబు

  • జాతీయ రాజకీయాలపై చర్చ
  • ఎన్డీయే ఓటమే తమ లక్ష్యమన్న చంద్రబాబు
  • ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపు

రానున్న ఎన్నికల్లో ఎన్డీయే ఓటమే తమ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలపై చర్చించామని ఆయన తెలిపారు. ఎన్డీయే ఓటమే లక్ష్యంగా కలసి వచ్చే అన్ని పార్టీలతో కలసి ముందుకెళతామని చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దక్షిణాదిలోని అన్ని పార్టీలు ఏకం కావాలని చెప్పారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కుమారస్వామితో భేటీ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. వంద రోజుల పాలనను పూర్తి చేసుకోనున్న కుమారస్వామి... తమ భాగస్వామ్య కాంగ్రెస్ నేతల నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు, కాంగ్రెస్ నేతలతో ఇబ్బందులపై త్వరలోనే చర్చిద్దామని కుమారస్వామికి చంద్రబాబు తెలిపారు. 

Chandrababu
kumaraswamy
  • Loading...

More Telugu News