Krishna District: 'సర్పహోమం' ఫలితమెక్కడ?... నిన్న ఒక్కరోజులో 10 మందిని కరిచిన పాములు!

  • అవనిగడ్డను వీడని పాముల గోల
  • ఆసుపత్రికి పరుగులు పెట్టిన బాధితులు
  • ఒకరిని మాత్రమే విష పూరిత పాము కాటేసిందన్న వైద్యులు

కృష్ణా జిల్లా అవనిగడ్డను పట్టిన విషసర్పాల పీడ ఇంకా పోలేదు. తమపై పాములు పగబట్టాయని, వాటిని శాంతింపజేయాలని మోపిదేవిలోని ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 'సర్పహోమం' చేయించినా ఫలితం కనిపించలేదు. బుధవారం నాడు వైభవంగా యాగం జరుగగా, గురువారం నాడు పాములు ఏకంగా పదిమందిని కాటేశాయి. అవనిగడ్డ ఆసుపత్రికి పాము కాటు బాధితులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. వీరిలో ఒక్కరిని మాత్రమే విషపూరితమైన సర్పం కరిచిందని వైద్యులు నిర్దారించారు. మిగతా వారిని కరిచిన పాముల్లో ప్రాణాలు తీసేంత విషం లేదని తేల్చారు. వారికి ప్రాధమిక చికిత్స చేసి పంపిన వైద్యులు, ఓ బాధితుడిని మాత్రం అబ్జర్వేషన్ లో ఉంచారు.

  • Loading...

More Telugu News